వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జతకలుస్తుందని ఇప్పటికే వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల మీటింగులో పాల్గొని దీనికి మరింత ఆజ్యం పోశారు. దీనిపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకాలు కూడా ముగిశాయని వార్తలు చూస్తూనే ఉన్నాం.

దీనిపై ఆ ఏపీ మంత్రి తెలుగుదేశం నేత అయిన అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వ్య్తకిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, ఆ పార్టీతో కలసి 2019 ఎన్నికలకు వెళితే ప్రజలు చీ కొడతారని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఈ పొత్తుని తీవ్రంగా వ్యతిరేకిస్తానని, రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చిన పార్టీ కాంగ్రెస్ అని, కానీ అలాంటి పార్టీతో తెలుగుదేశం పార్టీ కలసి పనిచేస్తే అది మా కర్మ అవుతుందని అయ్యన్న తన మనసులో మాట చెప్పారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •