దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎల్ కే అద్వానీ, లోక్ సభ మాజీ స్పీకర్ మురళీ మనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతిలపై నమోదైన కేసును సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

బాబ్రీ మసీదు కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతి తోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్ధోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. విచారణలో మొత్తం 351 మంది సాక్షులను సిబిఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కోగా విచారణలో ఉండగానే 17 మంది మరణించారు. 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు ఈ వివాదానికి తెరపడింది.

కొత్తపద్ధతిలో వాట్సాప్‌లను క్రాష్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. బాధితుల్లో సెలెబ్రిటీలు..!

మెగాస్టార్ చిరంజీవి మూవీలో రమ్యకృష్ణ..!

ఎట్టకేలకి బోణీకొట్టిన హైదరాబాద్.. కీలక సమయంలో విజయం నమోదు..!