జగన్, కేసీఆర్‌, పవన్‌ అజెండా ఒక్కటేనన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురూ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించబోరని, టీడీపీ పార్టీనే లక్ష్యం చేసుకొంటారని ఆరోపించారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీల బాధ్యులు ఇందులో పాల్గొన్నారు. తాను టీడీపీ కుటుంబ పెద్దను మాత్రమేనన్న బాబు.. ప్రజా సేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. సమర్థంగా పని చేసినంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని అన్నారు. ఈ ఐదేళ్లలో అనేక మందికి పదవులు ఇచ్చామన్న చంద్రబాబు.. భవిష్యత్‌లో ఇంత కన్న ఎక్కువ ఇస్తామన్నారు. రోజుకు 81 వేల మంది సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని, దీనిని రెట్టింపు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బూత్ కన్వీనర్ల శిక్షణను విజయవంతం చేయాలని కోరారు. కలెక్షన్ బ్యూరోగా సీబీఐని బీజేపీ మార్చేసిందని మండిపడ్డ చంద్రబాబు.. సీబీఐలో పీఎంవో జోక్యంపై ఆ శాఖ అధికారే వెల్లడించారని చెప్పారు. భాజపాయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీళ్ల అజెండా అని ఆయన అంటున్నారు. జగన్, కేసీఆర్‌, పవన్‌ అజెండా ఒక్కటేనన్న ఆయన.. భాజపాయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీళ్ల అజెండా అని సీఎం మండిపడ్డారు. గతంలో సోనియాగాందీని తీవ్ర పదజాలంతో దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆమె ను పొగడడం గమరణార్ధం.