తమ బిడ్డలను అందంగా తొమ్మిది నెలల పాటు కడుపులో దాచుకొని, వారి కోసం ఎన్నో ఊహలతో… మా చిట్టి బుజ్జాయి బయటకు వచ్చిన తరువాత ఎన్ని అల్లరి పనులు చేస్తుంటాడో అని, మీలో మీరే చిలిపిగా నవ్వుకుంటూ, ఆ జ్ఞాపకాలను రోజు నెమరు వేసుకుంటూ పదిలంగా మీ మనస్సులో ఎప్పటికి దాచుకుంటారు. ఆ క్షణాలన్నింటిని  దాటుకొని బిడ్డ పుట్టిన తరువాత ఆ మధుర క్షణాలను ఎల్లప్పుడూ మీతో పాటే ఉంచుకోవాలంటే మీరు 10 ఫోటోలను తీసుకొని మీతో జీవితాంతం భద్రపరుచుకోండి…. ఆ ఫోటోల గురించి ఒకసారి తెలుసుకుందాం.

మొదటిసారి డాక్టర్ బిడ్డను మీకు చూపిస్తునప్పుడు

బాబు పుట్టిన తరువాత మీరు పదిలంగా దాచుకోవలసింది వారి “చిట్టి చిట్టి పాదాలు”

ఇక ఆ బుజ్జి బాబుకి అప్పటికే అక్క లేదా అన్నా ఉంటే వారితో కలసి ఒక ఫోటో 

తల్లి నుంచి బిడ్డ వేరైనా మొదటి రోజు బుజ్జి బాబు ఎప్పుడూ నిద్రలోనే ఉంటాడు… ఆ క్షణాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా ఒక ఫోటో 

భార్యాభర్తలు ఇద్దరు కలసి బిడ్డ స్పర్శ తాకినప్పుడు ఆ మధురక్షణాలను అనుభవించే ఒక ఫోటో 

బుల్లి బాబు పాదముద్రలు

బుజ్జి బుజ్జిగా ఏడుస్తునప్పుడు

నాన్న చేతులలోకి తీసుకున్నప్పుడు ఆ మధురక్షణాలు 

మీ చేతులను గట్టిగా వదలకుండా పట్టుకున్నప్పుడు 

బాబు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు కొత్త, కొత్తగా… వింత వింత చూపులు చూస్తున్నప్పుడు ఒక ఫోటో 

ఇలా ఈ పది ఫోటోలను మీరు మొదటి రోజు బాబు పుట్టినప్పుడు తీసుకుంటే ఎల్లప్పుడూ జ్ఞాపకాలు మీకు పదిలంగా, ఆ ఫోటోలు చూసినప్పుడు మనసుకి హాయిగా, ఎంతో ఆహ్లాదంగా ఆ క్షణాలను అనుభవించవచ్చు. 

  •  
  •  
  •  
  •  
  •  
  •