ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నడుం నొప్పి సర్వసాధారణమై పోయింది. ఆఫీస్ లో ఎక్కువ సేపు కదలకుండా కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవడం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గతుకులు వచ్చిన సమయంలో కుదుపులకు లోనవ్వడం వంటి వాటి ద్వారా నడుం నొప్పి ప్రారంభమై అది తీవ్ర రూపానికి దారి తీస్తుంది. ఇక నడుం నొప్పి ఉన్నా… ఎప్పుడో సమయం దొరికినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లడం… మరలా పట్టించుకోకపోవడంతో తరచుగా తిరగబెడుతూనే ఉంటుంది. ఇక నడుం నొప్పికి మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో, నిద్ర పోయే సమయంలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ నుంచి నడుం నొప్పి పారిపోతుంది.

ఒక సాక్స్ తీసుకొని అందులో నిండా బియ్యం పోసి, సాక్స్ మూతిని కట్టివేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఆ బియ్యాన్ని వేడి చేసి మీకు ఎక్కడైతే నొప్పి ఉందొ ఆ ప్రదేశంలో కాపు కాచుకుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.

కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకొని అందులో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేసి, ఆ మిశ్రమం ఆరిపోయిన తరువాత ఒక బాటిల్ లో పోసుకొని నిల్వ ఉంచుకొని పడుకోబోయే ముందు మీ నడుముపై కాస్త ఈ మిశ్రమంతో మసాజ్ వారానికి మూడు సార్లు చేసుకోవాలి

స్నానం చేయడానికి ఒక గంట ముందు ఆవనూనెతో మీ శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వలన కూడా నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, కొంచెం తేనె వేసుకొని తాగడం వలన ఒళ్ళు నొప్పులతో పాటు దగ్గు జలుబు కూడా దరిచేరవు.

అల్లం కూడా నడుం నొప్పి తగ్గించడానికి తనవంతు పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే అల్లం టీ తాగడం వలన కూడా నడుం నొప్పికి ఉపశమనం కలిగించవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •