బాహుబలి సినిమా తరువాత హీరో ప్రభాస్ దేశవ్యాప్తంగా మంచి పాపులర్ సంపాదించుకున్నాడు. ఇక బాలీవుడ్ లో అయితే మంచి మార్కెట్ ను ఏర్పరుచుకుని ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆత్రుత కలిగేలా చేయగలిగాడంటే…  బాహుబలి సినిమాలో ప్రభాస్ చూపించిన నటనే కారణం.

 

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే తదుపరి సినిమా కూడా అదే రేంజిలో నిర్మిస్తూ… యాక్షన్ ఓరియెంటెడ్ గా వస్తున్న “సాహూ” పై మొదట్లో మంచి అంచనాలు ఉన్నా… సినిమా డేట్ దగ్గర పడుతున్న కొద్ది బాహుబలి సినిమాకు వచ్చినంత బజ్ తీసుకురావడంలో చతికలపడుతుంది.

ఇక గత వారం విడుదలైన సాహూ మొదటి పాట అయితే తెలుగు ప్రేక్షకులను అలరించకపోగా బాలీవుడ్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారా అన్న సందేహం వచ్చింది. అప్పట్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన “తుఫాన్” సినిమా కూడా బాలీవుడ్ కు పక్క రీమేక్ గా తెలుగు ప్రేక్షకులకు అనిపించింది. ఇప్పుడు సాహూ మొదటి పాటతో కూడా అదే పేరు తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.  

సాహూ సినిమాకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మొదటి పాటలో తీసుకోవలసిన జాగ్రత్త తీసుకోకుండా మేకర్స్ విఫలమవడంతో, సినిమాపై బారీ అంచనాలు ప్రేక్షకులకు కలిగించడంలో విఫలమయ్యారనే చెప్పుకొచ్చు. బాహుబలి మేకర్స్ సినిమా విడుదలకు ముందు సంచలనాలు సృష్టిస్తే… సాహూ మేకర్స్ మాత్రం సినిమాకు బజ్ తీసుకురావడంలో చతికిల పడుతున్నారు. సరిగ్గా మరొక్క నెల రోజులలో సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ యువీ సంస్థ ఎటువంటి స్ట్రాటెజితో అభిమానులని ఫిదా చేస్తుందో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •