చిరంజీవి తమ్ముడు కాబట్టే నాగబాబుకు ఇండస్ట్రీలో కాస్తో కూస్తో అతడికి పలుకుబడుందని, లేకపోతే నాగబాబుని పట్టించుకునేవారే లేరని, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలుగా చలామణి అవుతున్న కొంతమంది తనను పిలవకపోవడంపై బాలకృష్ణ ఎప్పుడైతే ఆగ్రహం వ్యక్తం చేసాడో, ఆ వెంటనే నాగబాబు రియాక్షన్ కు సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయి నోరేసుకొని అరిచేసుకుంటున్నారు.

నిన్న ఒక మీడియా సంస్థకు బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ నాగబాబు వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారని అడిగితే “ఛీ ఛీ నేనేమంటాను, అన్ని ఆయనే మాట్లాడుతున్నాడు కదా, నేను అసలు అలాంటివాడు గురించి స్పందించను” అనేలా బాలకృష్ణ మాట్లాడటంతో ఇప్పుడు చిరంజీవి – బాలకృష్ణ అభిమానుల మధ్య మరింత అగ్గిని రాజేసింది.

ఎవరు తగ్గకుండా ఒకరికొకరు కలబడుతూ తిట్టుకుంటుంటే ఇంతవరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి గొడవలు జనసేన – టీడీపీ పార్టీల మధ్య గొడవలుగా మారాయి. ఈ గొడవలకు తోడు మరికొంత మంది పేరులేని అనామక దర్శకులు మీడియా ముందుకు వచ్చి అగ్నికి ఆజ్యం పోసేలా ఇదే మంచి సమయమని ఇండస్ట్రీలో తామంటే ఏమిటో చూపించడానికి వ్యవహరిస్తున్న తీరుతో గొడవలు ఎంత దూరమేలతాయో చూడాలి.