తెలుగు రాష్ట్రాలలో 100 కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నామన్నారు నందమూరి బాలకృష్ణ. తిరుపతి పీజేఆర్‌ మూవీ ల్యాండ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనవరి 9 న ఎన్టీఆర్ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసారని.. అదే రోజు ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రాన్ని యాదృచ్చికంగా విడుదల చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో తండ్రి ఋణం తీర్చుకున్నానన్న ఆయన.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని అనుకరించడం కాదు పాత్రలో జీవించానన్నారు.

అలాగే చిరంజీవి తమ్ముడు నాగబాబు బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి అడగగా దానికి బాలకృష్ణ నో కామెంట్ అంటూ బదులిచ్చారు. కుమారుడు, తండ్రి పాత్ర చేయడం ప్రపంచంలోనే రికార్డు అన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా అమ్మ రుణం కొంత మేర తీర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ లో కనిపించని ఎన్నో లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయన్న ఆయన.. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారన్నారు.

బాలకృష్ణ తో కలసి నటించడం ఆనందంగా ఉందన్నారు హీరో సుమంత్. తాత ఏఎన్నార్‌ పాత్ర నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. ఎన్టీఆర్ బయోపిక్ ఓ సినిమా మాత్రమే కాదు ఓ చరిత్రల మిగిలిపోతుందన్నారు సుమంత్.
  •  
  •  
  •  
  •  
  •  
  •