ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై దాదాపుగా 12 రోజులు ముగిసాయి. మరొక్క రెండు రోజులలో అసెంబ్లీ సమావేశాలు ముగిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో కీలక సభ్యుడు హిందూపూర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎక్కడా కనపడటం లేదు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడటం సంగతి పక్కన పెడితే సభ్యుల మధ్య వాదనలు ప్రతివాదనలు జరుగుతున్న సమయంలో కూడా ఆ చుట్టూ పక్కల ప్రాంతాలలో కనిపించకపోవడంతో బాలకృష్ణ గురించి టీడీపీ పార్టీలో కొంత చర్చ నడుస్తుంది.

అసెంబ్లీకి బాలకృష్ణ అలా వచ్చి కాసేపు కూర్చుని వెళుతున్నాడని, ఒక వేళ అసెంబ్లీకి వచ్చినా ముభావంగా తనకు ఏది పట్టనట్లు వ్యవహరించడంతో టీడీపీ నాయకులు మాత్రం… బాలకృష్ణ లాంటి సీనియర్ నేతనే ఇలా వ్యవహరిస్తే ఇక తాము ఎందుకు అసెంబ్లీలో పోరాటం చేసి విపక్ష సభ్యుల చేసే విమర్శలను ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారట. 

దాదాపుగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు, ముగ్గురు తప్ప ఎవరు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలకు సమాధానం ఇవ్వకపోవడంతో చంద్రబాబు నాయుడుకి కూడా కొంత తలనొప్పిగా మారిందట. బాలయ్య బాబు అభిమానులేమో బయట సీఎం సీఎం అని నినాదాలు చేస్తుంటే బాలకృష్ణ అసెంబ్లీలో సైలెంట్ గా ఉంటూ, విపక్ష సభ్యుల ఆరోపణలు తిప్పి కొట్టకపోవడం శోచనీయం. బాలకృష్ణ కూడా ఇంకా ఐదు సంవత్సరాల తరువాత కదా ఎన్నికలనట్లు తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకుపోయే సూచనలే ఎక్కువ కనపడుతున్నాయి.
  •  
  •  
  •  
  •  
  •  
  •