నందమూరి బాలకృష్ణ మరొకసారి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో “సింహ, లెజెండ్” సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమాకు రంగం సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే సినెమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ప్రగ్న్య జైస్వాల్ బాలకృష్ణ పక్కన నటించనుందని తెలుస్తుంది.

ఈ సినిమాను నవగ్రహాలు ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. నవగ్రహాలు వాటి ప్రభావం మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా బాలకృష్ణ వారణాసికి సంబంధించిన ఎపిసోడ్ లో ‘అఘోర”గా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమాతో బోయపాటి – బాలకృష్ణ ఇద్దరికి అర్జెంటుగా హిట్ అవసరం. బోయపాటి గత చిత్ర “వినయ విధేయ రామ” డిజాస్టర్ టాక్ తో బయ్యర్లను నిలువునా ముంచేసింది. బాలకృష్ణ నటించిన గత నాలుగు సినిమాలు కూడా వరుసగా ఫెయిల్ కావడంతో ఈ సినిమా హిట్ కావలసిన అవసరం ఉంది. ఈ సినిమాను దాదాపుగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •