నందమూరి బాలకృష్ణ మహాకూటమి స్టార్ కాంపైనర్ గా ఉంటాడని ఇది వరకే ప్రకటించారు. ఇక కూకట్ పల్లి అభ్యర్థిగా చుండు సుహాసిని నామినేషన్ సమయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రచారం చేస్తానని బాలకృష్ణ తెలియచేసారు. కానీ ఏమైందో ఏమో గాని, ఇప్పుడు చంద్రబాబుతో పాటు, బాలకృష్ణ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోరని తెలియవస్తుంది. రెండు రోజులలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ విడతల వారీగా తెలంగాణ జిల్లాలో పర్యటించనున్నారు. వారి ర్యాలీలో పాల్గొనాలన్న బాలకృష్ణకు ఇప్పుడు భంగపాటే అని చెప్పుకోవాలి.

చంద్రబాబు నాయుడు వల్ల వచ్చే ఓట్లు కూడా పడవని, కాంగ్రెస్ పార్టీ భావించి చంద్రబాబు నాయుడుని ప్రచారానికి వద్దని తెలంగాణ కాంగ్రెస్ సున్నితంగా చెప్పి పక్కన పెడితే, బాలకృష్ణ వల్ల మరొక ప్రాబ్లెమ్ కనపడుతుంది. బాలకృష్ణకు చిరెత్తితే పక్కన ఎవరు ఉన్నారని కూడా చూసుకోకుండా చేయి చేసుకోవడం అలవాటు. బాలకృష్ణ ప్రవర్తన గతంలో చాల సార్లు తెలుగుదేశం పార్టీని ఇబ్బందికి గురిచేశాయి. ఇప్పుడు మరోసారి, బాలకృష్ణ పర్యటనతో జరగరానిది ఏదైనా జరిగితే, కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని బావిస్తున్నారట.

గత నెలలో ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ఒకరి మీద చెయ్యి చేసుకుంటే బాలకృష్ణ వెళ్లిపోయిన తరువాత ఆ ప్రాంతంలో తెలుగుదేశం జెండాలు తగలబెట్టి వారి నిరసన తెలియచేసారు. లేనిపోనివి కొని తెచ్చుకోవడం కన్నా స్తబ్దుగా ఉండటమే బెటర్ అని కాంగ్రెస్ భావిస్తుంది. బాలకృష్ణ మాత్రం కూకట్ పల్లి వరకు ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్కడ నందమూరి హరికృష్ణ కుమార్తె పోటీ చేయడంతో అక్కడ ఎన్నికల బాధ్యతను తీసుకొని గెలిపించేందుకు కృషి చేస్తారని తెలుగుదేశం వర్గాలు తెలియచేస్తున్నాయి.

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి