ఎన్టీఆర్ తాను హీరోగా చేసే సమయంలో షూటింగ్ సమయంలో చాల కఠినంగా ఉండేవారని, ఎన్టీఆర్ దేవుని పాత్రలకు సంబంధించి సినిమాలు చేస్తున్న సమయంలో ఆ సినిమా చేసిన అన్ని రోజులు అదే మూడ్ లో వుంటూ సినిమాపై తనకు ఉన్న మక్కువతో పాటు, తాను నిర్వహిస్తున్న పనికి పూర్తి బద్ధుడిగా మెలుగుతూ ఉంటాడని ఎన్టీఆర్ తో నటించిన తోటి మిత్రులు చాల మంది చెప్పడం మనం చెబుతుంటే మనం విన్నాం.

ఇప్పుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఎంత కఠినంగా ఉంటారో ఒక ఉదాహరణ చెబుతూ తాను, తన తండ్రి ఎన్టీఆర్ తో కలసి నటించిన “విశ్వమిత్ర” షూటింగ్ జరుగుతున్న సమయంలో “కపాల మోక్షం”కు సంబంధించి సన్నివేశం తెస్తున్నారు. ఆ సమయంలో నా కాలి దగ్గర ఒక టపాకాయ పేలాలి. అది పేలక పోవడంతో ఎన్టీఆర్ మరొక టపాకాయ విసరమంటూ ఆదేశించారు. ఆ టపాకాయ పేలడంతో పాటు, అంతకు ముందు విసిరిన టపాకాయ కూడా పేలింది. ముందు పేలిన టపాకాయతో తన కాలికి దెబ్బ తగిలిందని, అది చూసిన ఎన్టీఆర్ ఏమాత్రం చలించకుండా నెక్స్ట్ షార్ట్ అంటూ వెళ్లిపోయారని బాలకృష్ణ తెలియచేసాడు.

తన కొడుకుకి గాయమైతే వేరే వాళ్ళైతే షూటింగ్ లో కొంత హడావిడి చేసేవారని, కానీ ఎన్టీఆర్ తమను అలా పెంచలేదని, ఆలా పెంచకపోవడమే తమకు కష్టాల్ని భరించే దైర్యం తమకు వచ్చిందని బాలకృష్ణ అన్నారు. నాన్న మొదటి నుంచి తమను గారాబం చేయలేదని, అలా అని తన కష్టాలు మా దగ్గర చెప్పుకొని బాధపడింది లేదని ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని బాలకృష్ణ కొంత ఎమోషన్ కు గురవుతూ చెప్పారు. బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా నిన్న మొదటి భాగం విడుదలైతే రెండవ భాగం వచ్చే నెల ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతుంది.