నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడవ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సంబంధించి ఒక పాత్రలో బాలకృష్ణ “అగోరా”గా నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన “బంగారు బుల్లోడు” చిత్రంలోని “స్వాతిలో ముత్యమంతా” సాంగ్ ను రీమిక్స్ చేయాలని చిత్ర బృందం బావిస్తుందట.

ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ ఈ పాటకు సంబంధించి రీమిక్స్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ పాటకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. బాలకృష్ణ పక్కన ఈ సినిమాలో శ్రీయ, అంజలి నటించనున్నారు. వారిద్దరూ గతంలో బాలకృష్ణతో పలు సినిమాలలో నటించారు. అత్యంత బారి బడ్జెట్ తో ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •