టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందర సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటనలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వసుంధరాకు హైదరాబాద్ బంజారాహిల్స్ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఈ నెల 13న బ్యాంక్ మేనేజర్లు ఫణింద్ర, శ్రీనివాస్ లు వసుందర ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి వసుందర మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని యాక్టివేట్‌ చేయమంటారా? అని ప్రశ్నించారు.

అయితే వారు మొబైల్ బ్యాంకింగ్ కు అసలు ఆప్లై చేయలేదని అసలు అప్లికేషన్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో వసుందర సంతకాన్ని కొత్తగా వచ్చిన అకౌంటెంట్ శివ ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. మొబైల్ బ్యాంకింగ్ కోసం ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు శివ. ఇక వసుందర ప్రతినిధి వెలగల సుబ్బారావు పోలీసులకు పిర్యాదు చేయడంతో అతడిపై క్రిమినల్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •