గత వారం సినీ పరిశ్రమకు చెందిన పెద్దలంతా సీఎం కేసీఆర్ ను కలసి సినీ పరిశ్రమలో ఉన్న కష్ట నష్టాలతో పాటు కరోనా నేపథ్యంలో మూతపడిన సినీ పరిశ్రమను మరల తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీటింగ్ చిరంజీవి అధ్యక్షతన జరిగింది. దీనికి హిందుపూర్ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణను పిలవకపోవడంతో అతడు బీప్ సౌండ్ తో ఇష్టానుసారంగా సినీ పెద్దలపై వ్యాఖ్యలు చేస్తూ, భూములు పంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కలిశారని అనేక ఆరోపణలు చేశారు.

దీనిపై బాలకృష్ణకు చిరంజీవి క్యాంప్ నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. ఇది నిర్మాతలంతా కలసి వెళ్లి తమ సమస్యను తెలియయచేశామని, బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి సినిమా నిర్మించడం లేదని, ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే చూస్తూ ఎవరు ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ చేసిన లొల్లితో, త్వరలో జూన్ మొదటి వారంలో సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నారు. ఆ సమావేశానికి అతడిని ఆహ్వానించాలని చూస్తున్నారు. ఒకవేళ సినీ పరిశ్రమ నుంచి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ ను కలవాలని ఆహ్వానం అందితే బాలకృష్ణ వస్తాడంటారా?

అసలే ఏపీలో టీడీపీ – వైసీపీ పార్టీ ల నడుమ ఉప్పు నిప్పుల ఉన్న వైరంతో తనకు ఆరోగ్యం బాలేదని డుమ్మా కొడతాడా అనేది ప్రశ్నర్ధకంగానే ఉంది. నిజంగా బాలకృష్ణ తాను సినీ పరిశ్రమ మేలు కోరితే కచ్చితంగా వెళ్లి తీరాలి. లేకపోతే మాత్రం అతడు కావాలనే రచ్చ చేసినట్లు భావించవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుని పర్మిషన్ అడిగితే ఇచ్చే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. బాలకృష్ణ వ్యవహారం ఎలా ఉంటుందో రాబోయే రోజులలో ఏపీ సీఎం జగన్ ను కలిసే సమయంలో మొత్తం వ్యవహారం బయటపడుతుంది.

గణపతి శాస్త్రి చేసిన యాగం, సంజయ్ గాంధీ మరణానికి దారి తీసిందా?

సీఎం జగన్ మనస్తత్వం ఎలాంటిదో సింధు విషయంలోనే తెలుస్తుంది