నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కరోనా ముందే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్స్ ను అనుకోవడం జరిగింది. ఇక చివరిగా అమలాపాల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నాడని.. ఒక పాత్ర అనంతపురం రైతుల కోసం పోరాట చేస్తాడని అంటున్నారు.

ఇక గతంలో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, ‘లెజండ్’ సినిమాలు మంచి హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్ టాక్ ఫీచర్..!

పాయల్ రాజ్‌పుత్ కు బంపర్ ఆఫర్..!