మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడు ఎవరికీ ఒక పట్టాన అర్ధం కారు. వారు చేసే పనులు చేష్టలు అన్ని ఎప్పుడు విమర్శలకు దారితీస్తూనే ఉంటాయి. మన టాలీవుడ్ హీరోలకున్న ఫ్యాన్ బేస్ వారిని నెత్తిన పెట్టుకొని అభిమానులు పూజించినట్లు ఏ ఇండస్ట్రీలో జరగదు. మన హీరోలకు సంబంధించిన సినిమా విడుదల లేదా పుట్టినరోజు వచ్చిందంటే ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా ట్రెండ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అలాంటి అభిమానులను మన హీరోలు పెద్దగా పట్టించుకున్న ధాఖలాలు, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆర్ధిక సాయాలు గట్రా కూడా ఉండవు. ఇక కరోనా సమయంలో మన హీరోలు ఏదో అలా డబ్బులు విదిల్చి తమ భార్యలతో కలసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ వంటల కార్యక్రమాలు, ఇల్లు ఊడ్చే కార్యక్రమాలతో గడిపేశారు.

సరే అభిమానుల విషయంలో అలా చేసారంటే వారి స్వార్ధం అనుకోవచ్చు. కానీ గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం చనిపోతే మన తెలుగు హీరోలు ఒక్కరు కూడా వెళ్లి పార్థివదేహానికి నివాళుర్పించాలనిపించలేదు. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. కరోనా సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రితో చర్చలకు మాత్రం వెళ్లారు. ఏపీ సీఎం జగన్ అప్పాయింట్మెంట్ దొరికిందని ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి సీఎంతో కాసేపు ముచ్చట్లు గట్రా చెప్పివచ్చారు. కానీ బాలసుబ్రమణ్యం ఎంతో మందికి తన గాత్రాన్ని ఇచ్చి, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి వారి విజయంలో తోడ్పాటునందించిన అతడికి మాత్రం చివరిసారిగా చూసి రావాలని అనిపించలేదు.

కానీ తమిళ హీరోలు, అక్కడ ప్రభుత్వం మొత్తం బాలసుబ్రమణ్యం చివరి చూపు కోసం అతడి పార్థివదేహానికి స్వయంగా వచ్చి నివాళుర్పించారు. కమల్ హాసన్ మొదలు హీరో విజయ్ ఇలా అనేక మంది తమ ఇళ్ల నుంచి కదిలివచ్చి కరోనా సమయంలో ఒక గొప్ప గాయకుడికి నివాళ్లు అర్పించారు. మన హీరోలు బాలసుబ్రమణ్యం పాడిన పాటలతో ఎన్నో సూపర్ హిట్స్ కొట్టి అతడి పేరుతో ఎంతో ఘనత సొంత చేసుకొని అతడిని చూడానికి వెళ్ళకపోవడం మాత్రం అత్యంత బాధాకరం. అసలు మన టాలీవుడ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే బాలసుబ్రమణ్యంకు పద్మా అవార్డు సిఫార్సు చేసింది తమిళనాడు ప్రభుత్వం. కానీ మన తెలుగు హీరోలు మాత్రం బాలుకి మంచి గుర్తింపు కోసం ఏమాత్రం ప్రయత్నించలేదు.

తమిళ ప్రజలు బాలుని ఏ విధంగా పొగడ్తలతో ముంచారో తెలుసా “బాలసుబ్రమణ్యం ది ప్రైడ్ అఫ్ తమిళనాడు”అని గర్వంగా చెప్పుకున్నారు. ఇక కన్నడ మీడియా అయితే ఏకంగా బాలుకి మరో జన్మ అంటూ ఉంటే తమ గడ్డపై పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అంతటి గాన గంధర్వుడిని మన తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులు పూర్తిగా మర్చిపోయి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం వరకు మాత్రం సరిపెట్టుకున్నారు. చిరంజీవిని సొంత తమ్ముడిగా భావిస్తాడట బాలు గారు. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది నటులకు అతను అంటే ఇష్టం కానీ కడసారి చూపు కోసం వెళ్లి చూడాలనుకుంటే గంటలో చార్టెడ్ ఫ్లైట్ లో అలా తమిళనాడు వెళ్లే అంత స్థాయి ఉన్నా ఎవరు ఇళ్ల నుంచి బయటకు కదలలేదు.

ఇప్పుడు బాలుకి జరిగిన అవమానం గతంలో ఘంటసాల గారికి కూడా జరిగింది. తన మధురమైన గాత్రంతో ఎన్నో సంచలన విజయాలను అందించిన ఘంటసాల చివరి చూపుకి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా వెళ్ళలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అన్ని సూపర్ హిట్ పాటలను వారి సినిమాల ద్వారా అందించారంటే ఒక్క ఘంటసాల వలనే. కానీ ఘంటసాల చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ “తాతమ్మకల” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఏఎన్ఆర్ పై అప్పట్లో చూడటానికి వెళ్లలేదని విమర్శలు వస్తే తాను ఘంటసాలను ఆ విధముగా చూడలేనని తప్పించుకున్నారు. ఇలా ఉంటుంది మన తెలుగు హీరోల పరిస్థితి. అవసరానికి వాడుకోవడమే తప్ప గుర్తుంచుకొని కడసారి నివాళు అర్పించే అంత సమయం లేదు. ఇది ఒక్క తెలుగు పరిశ్రమకే ఈ తెగులు ఎక్కువగా ఉంది. తమిళ, కన్నడ పరిశ్రమలు అలా ఉండవు. వారి ఉన్నతి కోసం సహాయం చేసిన నటి నటులను నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటారు. మనకు మాత్రం సంపాదనే పరమావధిగా డబ్బులను కోట్లకు కోట్లు పోగేసుకొని జల్సాలు చేస్తుంటారు.

విలాసాలనే మాట నేను ఎప్పుడో మర్చిపోయానంటున్న అనిల్ అంబానీ

ఏడో తరగతి యువకుడు కరోనా టీకాను కనిపెట్టానని హల్ చల్, ఉలిక్కిపడ్డ పోలీసులు