బండ్ల గణేష్ అంటేనే కొంత వివాదాస్పద నటుడు, సినీ నిర్మాత, పొలిటికల్ కమెడియన్ ఇంకా ఇలా చాల పేర్లతో పిలుచుకోవచ్చు. గొప్పలు చెప్పమంటే తాను ట్రంప్ తో అరగంటలో ఫోటో దిగి వస్తానని కేఏ పాల్ కన్నా ఎక్కువ కబుర్లు చెప్పి ఆ మధ్య ప్రేక్షకులను బాగానే అలరించాడు. తెలంగాణాలో అయితే అసలు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేదే నేనే అన్నట్లు బిల్డ్ అప్ ఇచ్చి… కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానని బండ్ల చేసిన హడావిడికి ప్రజలంతా హతవిధీ అనుకున్నారు.

ఇలాంటి కామెడీ పండించడంతో పాటు, తనకు అప్పు ఇచ్చిన వారిని ఏడిపించడం కూడా బండ్ల గణేష్ కు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దాదాపుగా 60 మంది బండ్ల గణేష్ కు పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బులకు గాను గణేష్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ ఆయాయ్యి. దీనితో పాపం వారు చేసేది లేక కోర్ట్ ను ఆశ్రయిస్తే మంగళవారం ఆ కేసు వాయిదా ఉండటంతో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్ట్ మెట్టులెక్కడు. మేజిస్ట్రేట్ ఈ కేసుని ఆగష్టు ఏడవ తారీకుకు వాయిదా వేశారు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •