బంగారు బల్లి అనగానే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తు వస్తుంది. బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన అక్కడ బల్లిని తాకితే సకల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఇక అంతరించే జాతుల్లో చేరిన ఈ బంగారు బల్లి కొన్నాళ్లుగా కనిపించడం లేదు. గతంలో 2016 లో ఈ బంగారు బల్లి తిరుమల చక్రతీర్ధం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభసమయంలో భక్తుల కంటపడింది.

ఇప్పుడు మళ్ళీ శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి తిరుమల కొండలలోని శ్రీవారి ఆలయానికి వెనుకనున్న శిలాతోరణంపై దర్శనమిచ్చింది. ఇక గతంలో 2016 లో ఈ బంగారు బల్లి తిరుమల చక్రతీర్ధం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభసమయంలో భక్తుల కంటపడింది.