మరి కొద్ది సేపటిలో భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా డే/నైట్ టెస్ట్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు వేలాదిగా స్టేడియంకు చేరుకుంటున్నారు. భారతదేశ క్రికెట్ చరిత్రలో మొదటిసారి పింక్ బాల్ తో మ్యాచ్ ఆడనుండటంతో అభిమానులు ఇదొక పండుగలా జరుపుకుంటున్నారు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంతో పాటు, కోల్ కతాలోని చారిత్రాత్మక కట్టడాలు, పార్కులు, రెస్టారెంట్ లు అన్ని పింక్ కలర్ మయం అయిపోయాయి. అందరూ పింక్ కలర్ తో అందంగా తీర్చిదడ్ఢటంతో కోల్ కతా ఇప్పుడు పింక్ సిటీగా మారిపోయింది. ఈ మ్యాచ్ కోసం పింక్ బాల్ తో క్రికెటర్లు గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.