మధ్యప్రదేశ్ లోని నిరసింహపూర్ జిల్లాలో సెంట్రల్ బ్యాంకు లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. బ్యాంకులో దొంగతనం చేయడానికి వచ్చిన ఓ దొంగ క్యాషియర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తికి అక్కడ నుండి పారిపోయాడు. ఓ యువకుడు ముఖానికి ముసుగు వేసుకుని బ్యాంకులోకి ప్రవేశించాడు. తనతో తెచ్చుకున్న గన్ బయటకి తీసి బ్యాంకులో ఉన్న వ్యక్తులను భెదిరించాడు. ఆ తరువాత క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్భులు ఇవ్వమంటూ క్యాషియర్ కు గన్ ఎక్కుపెట్టాడు.

దీంతో క్యాషియర్ తెలివిగా అక్కడే ఉన్న సైరన్ బట్టన్ నొక్కడంతో ఆ శబ్దం వినగానే ఆ దొంగ అక్కడ నుండి పారిపోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకొని.. అక్కడ సిబ్బందిని విచారించారు. ఇక సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •