ఇండిపెండెన్స్ డే రోజున అల్లు అర్జున్ తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు ఆగష్టు 15 న టైటిల్ ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ సినిమా తండ్రి కొడుకుల నేపథ్యంలో సాగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బన్నీ, వెన్నిల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యేలా ప్లాన్ చేశారట త్రివిక్రమ్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •