కటింగ్ చేయనన్నందుకు ఓ బార్బర్ ను ఓ వ్యక్తి కాల్చి చంపాడు. బీహార్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బీహార్ లోని దినేష్ ఠాకూర్ కటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా తన సెలూన్ షాపును మూసివేశారు. అయితే గ్రామస్థులు కట్టింగ్ చేయాలనీ కోరడంతో ఆ బార్బర్ నిరాకరించాడు.

ఈ క్రమంలో బిపిన్ దానే అనే వ్యక్తి ఇంటికి రావాలంటూ దినేష్ ఠాకూర్ కు కబురు పెట్టాడు. అలా వెళ్లిన దినేష్ బుల్లెట్ గాయాలతో విగత జీవిగా పడి ఉన్నాడు. ఇక ఈ ఘటనపై దినేష్ ఠాకూర్ భార్య పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. దీంతో ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఏపీలో తొలిరోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఆదాయం ఎంతో తెలుసా..!

కారు ప్రమాదంలో యువ నటుడు మృతి..!

ప్రముఖ యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు నమోదు..!