భర్త తాగొచ్చి రోజు భార్యను హింసిస్తున్నాడంటే అది అసలు పెద్ద మ్యాటర్ ఏమి కాదు. మన దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలాన ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక భార్య రోజు తాగొచ్చి భర్తతో పాటు అత్త మామలను చితాబాదుతున్న వార్త మాత్రం కాస్త సంచలనంగానే ఉంది. గుజరాత్ కు చెందిన ఒక జంటకు 2018లో పెళ్లయింది. పెళ్లి తరువాత అతగాడికి తన భార్య రోజు తాగొచ్చే అలవాటుందని తెలిసివచ్చింది. మొదట్లో మందు తాగిన ఎలాంటి గొడవ చేయకుండా కిక్కురుమనకుండా ఉండేదట.

కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఆమె నిజస్వరూపం బయట పడటంతో పాటు తాగొచ్చి ఇంట్లో కర్ర తీసుకొని భర్తతో పాటు అత్త మామలను చితకబాదుతుందట. ఆమె టార్చర్ తట్టుకోలేక ఆమె భర్త తల్లితండ్రులు వేరుగా ఉంటున్నారు. దానితో ఇక భర్త ఒక్కడే కావడంతో అతడిపై రోజు వేధింపులకు దిగడంతో అతడు చివరకి విసిగి వేసారిపోయి పోలీసులకు కంప్లైన్ట్ చేసాడు. ఆమె ఎక్కువగా తాగినప్పుడు తనతో పాటు ఆఫీస్ లో పనిచేసే సహఉద్యోగుల పట్ల కూడా దారుణంగా ప్రవర్తించేదట.

కొన్నిసార్లైతే ఏకంగా భర్త అత్త మామలపై చిత్ర హింసలకు గురి చేస్తున్నారని మహిళా హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తనను కట్నం కోసం వేధిస్తున్నారని కంప్లైన్ట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయట. ఆమెలో అనేక రకాల వేరియేషన్స్ ఉండటంతో చుట్టుపక్కల వారు పాపం అనుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితట. ఒకటి రెండు సార్లు చుట్టుపక్కల ఉండే వారు కల్పించుకొని సర్దిచెప్పాలని చూస్తే వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడంతో వారు కిమ్మనుకుండా కుర్చున్నారట. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో భార్య బాధితుడికి పోలీసులు ఎలా న్యాయం చేస్తారో చూడాలి.