బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగ దసరా పండుగకు రెండు రోజుల ముందు మొదలవుతుంది. ఈ పండుగతో పాటు దసరాను కూడా ఎంతో విశిష్టంగా చేసుకుంటుంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైనది. అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో చరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి.

ఒక రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒక్కగానొక్క ముద్దుల చెల్లెలు ఉంది. ఆ ఏడుగురు అన్నదమ్ములు వీరాది వీరులే. అందరకి పెళ్లిళ్లయ్యాయి. ఆ ముద్దుల చెల్లెలు అన్నదమ్ములతో పాటు ఆ ఇంట్లోనే ఉండేది. ఆ ముద్దుల చెల్లెలు ఆ ఏడుగురు అన్నదమ్ములు గారాబంగా చూసుకోవడం వారి భార్యలకు నచ్చదు. ఒకరోజు ఆ ఏడుగురు అన్నదమ్ములు వేటకు వెళ్లారు.

ఆదిత్య హృదయం మన కార్యసిద్ధికి ఎలా ఉపయోగపడుతుంది

ఇక అదును చూసుకొని ఆమె ఏడుగురు వదినలు సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టారు. వారు పెట్టే బాధలను తట్టుకోలేక పోయింది. ఇక పెద్ద వదిన పాలలో విషం ఇవ్వడంతో ఆ చిట్టి చెల్లు మరణిస్తుంది. ఆమెను ఎవరకి తెలియకుండా ఒకచోట పూడ్చిపెడతారు. వారు పాతిపెట్టిన చోట తంగేడు చెట్టు విరగపూస్తుంది.

తరువాత ఆ ఏడుగురు అన్నదమ్ములు ఆ చిట్టి చెల్లెలు కోసం గాలించని ప్రదేశం లేదు, కొండలు, గుట్టలు అన్ని ప్రాంతాలు తిరిగి అలసిపోయి తమ ఊరికి చేరుకున్న తరువాత ఊరిలో విరగబూసిన తంగేడు చెట్టు దగ్గరకు వచ్చి ఆగుతారు. ఆ చెట్టు నుంచి ఆత్మ రూపంలో చెల్లెలు తనకు జరిగిన విషయం చెప్పుకుంటుంది. అప్పుడు ఆ ఏడుగురు అన్నలు నీకు ఏమి కావాలో కోరుకోమంటే ఈ తంగేడు పూలలో నన్ను చూసుకోండని, ఏటా నా పేరున పండుగ చేయండని చెప్పిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

ఇక బతుకమ్మ గురించి మరొక కథ కూడా ప్రాముఖ్యతలో ఉంది

కొన్నేళ్ల క్రితం సంతానం లేక పరితపిస్తున్న దంపతులకు ఒక పాప దొరకగా, ఆ పాపను అమ్మవారి ప్రసాదంగా బావించి పెంచి పెద్ద చేయగా, ఆమె పెద్దదైన తరువాత లోకహిత కార్యాలు చేయడంతో ఆమె చుట్టూ చేరి దైవ స్వరూపంగా మహిళలు కొలుస్తుండటంతో ఈ పండుగ వచ్చిందని చెప్పుకుంటుంటారు.

మరొక కథగా

ఒక బాలబాలిక భూస్వామ్యుల అకృత్యాలను వారి చేసే దారుణాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. కొన ఊపిరితో అల్లాడుతున్న ఆమెను కలకాలం ‘బతుకమ్మా’ అని దీవించడంతో అప్పటి నుంచి ‘బతుకమ్మ’ అనే పేరుతో పండుగ చేసుకుంటారని చెబుతుంటారు. అందుకే ఈ పండుగను ప్రత్యేకంగా మహిళలే చేసుకుంటారు. మహిళలందరూ తమకు ఎలాంటి ఆపదలు రావద్దని, తమ కుటుంబమే మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా గౌరమ్మను పూజిస్తుంటారు.

మరొక కథగా

తెలంగాణ గ్రామీణ సమాజంలో అప్పట్లో నవాబులు, భూస్వాములు, పెత్తదారిలా చేతిలో నలిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. వారి చెవులను చూసి తోటి మహిళలు విచారిస్తూ వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అనే పాటల వెనుక ఉండే మర్మం ఇదేనని చరిత్రకారులు చెబుతుంటారు.

ఇలా ఎన్నో కథలు ప్రాచీనంలో ఉన్నాయి. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు రోజుకొక నైవేద్యంతో పూజిస్తుంటారు.తెలంగాణాలో ఉన్న ప్రతి మహిళ బంగారు బతుకమ్మలను తయారు చేసుకొని ఈ తొమ్మిది రోజులు పూజిస్తుంటారు.

దసరా అనే పేరు ఎలా వచ్చింది, పండుగ చరిత్ర