పాత రోజులలో అందరికి టీవీలు ఉండేవి కావు. ఒకవేళ టీవీలు ఉన్నా, భారత్ లో జరిగే మ్యాచ్ లను మాత్రమే మనకు వచ్చేవి. మిగతా దేశాలలో జరిగే మ్యాచ్ లు రావాలంటే పే చానెల్స్ లో వచ్చేవి. అవి కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండేవి, మరికొన్ని ప్రాంతాలలో కేబుల్ ఆపరేటర్లు తీసుకునే వారు కాదు. ఇక అప్పట్లో క్రికెట్ ప్రేమికులు రేడియోలో వచ్చే క్రికెట్ కామెంటరీ చూస్తూ ఆనందించేవారు. తరువాత కాలానుగుణంగా అన్ని ప్రాంతాలలో టీవీలు అందుబాటులోకి రావడంతో రేడియో వీక్షకులు తగ్గిపోవడంతో రేడియోలో ప్రసారం నిలిపివేశారు.

కానీ ప్రయాణంలో ఉన్నవారికి క్రికెట్ కామెంటరీ వినాలని ఉన్నా, వినలేక ఇంటర్ నెట్ ద్వారా క్రికెట్ స్కోర్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక బీసీసీఐ మరోసారి ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల కోసం మరోసారి రేడియోలో క్రికెట్ కామెంటరీని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దానిలో భాగంగా త్వరలో దక్షిణాఫ్రికాతో మొదలు కాబోయే సిరీస్ తో ఈసదుపాయాన్ని తీసుకురానున్నారు. మరోసారి క్రికెట్ లవర్స్ కామెంటరీ వింటూ ఫుల్ గా ఎంజాయ్ చేసే రోజులు వచ్చేస్తున్నాయి. దీనిపై అన్ని వర్గాల నుంచి బీసీసీఐకు అబినందనలు తెలియచేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •