“రాక్షసుడు” సినిమాతో విజయం సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఇక ఈ హిట్ తో తాను ఒక ఇంటి వాడు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ అతడి కోసం అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాడట. ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబం నుంచి కాకుండా బయట సంబంధాలు చూస్తున్నట్లు బెల్లంకొండ చెబుతున్నాడు.

బెల్లంకొండ సురేష్ తన కొడుకు మీద ప్రేమతో ఎన్నో సినిమాలను బారి స్థాయిలో నిర్మించి నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నించాడు. తన ప్రయత్నాలు కొంత సఫలం కాగా కొన్ని విఫలమయ్యాయి. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన సినిమాలు బీసీ సెంటర్స్ లో మొదటి నుంచి కొంచెం ఆదరణ ఎక్కువగా ఉండేది. ఇక “రాక్షసుడు” సినిమా హిట్ తో… మరొక రీమేక్ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •