మనం చిన్నప్పుడు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చెబుతుండేవారు. బెండకాయ తింటే లెక్కలు వస్తాయో రావో తెలియదు గాని షుగర్ వ్యాధిని మాత్రం బాగా కంట్రోల్ లో పెడుతుందట. షుగర్ వ్యాధికి బెండకాయ అత్యంత సులువైన పరిష్కారమని చెబుతున్నారు.

ప్రతిరోజు రెండు బెండకాయలను తీసుకొని వాటిని మధ్యలోకి కోసి అటు, ఇటు ఉన్న రెండు కోణాలను కోసి వేసి ఒక గ్లాసులో వేసి నిండుగా నీరు పోసి రాత్రంతా మూత వేసి ఉంచాలి. ఆ నీటిని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు గ్లాసులోని బెండకాయలను తీసివేసి ఆ నీటిని తాగాలట. ఆలా రెండు వారాల పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండా బెండకాయ నీటిని తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వడంతో పాటు, దాదాపుగా పూర్తిగా వ్యాధి తగ్గుతుందట. కానీ బెండకాయ నీరు తాగటమంటే అంత సులభమైన విషయం కాదు. బెండకాయలో ఉండే జిగురు మొత్తం నీటిలోకి చేరి మనం తాగేటప్పుడు చాల ఇబ్బందికరంగా మారుతుంది. మరి తాగడానికి ఇబ్బందిగా ఉన్నా కస్టపడి తాగితేనే కదా రోగం మటుమాయమయ్యేది.

ఈ కూరగాయలో కనిపించే ఖనిజాలు,విటమిన్లు మరియు సేంద్రీయ పదార్దముల కారణంగా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయ తోటలో పెంచే ఒక సంప్రదాయ వెజిటబుల్ అని చెప్పవచ్చు. దీనిలో A,B,C,E మరియు K విటమిన్లు,అలాగే కాల్షియం,ఇనుము,మెగ్నీషియం, పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి. అంతేకాక బెండకాయ లో ముసిలగినౌస్ ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •