బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ నుండి ‘మహానటి’ కీర్తి సురేష్ తప్పుకున్నట్లుగా సమాచారం. అజయ్ దేవగన్ నటిస్తున్న మైదాన్ లో ఆమె హీరోయిన్ గా నటించాల్సి ఉంది. 1952 నేపథ్యంలో పుట్ బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ నుండి కీర్తి తప్పుకుందట. ఈ సినిమాలో కీర్తి.. అజయ్ దేవగన్ భార్యకు తగినట్లుగా లేదట. చిన్న పిల్లలా కనిపిస్తుందన్న ఉద్దెశంతో బాలీవుడ్ ఎంట్రీకి ఈ సినిమా సరైంది కాదనుకుని తప్పుకుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు బోణి కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు బోణి కపూర్, కీర్తి సురేష్ పరస్పర ఒప్పందానికి వచ్చారట.