మన దేశంలో మూడు రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్స్ ను తొలగించడంతో, టిక్ టాక్ చూడకుండా…వీడియోలు చేయకుండా నిద్రపోని కొంతమందికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలుస్తుంది. మరల టిక్ టాక్ తిరిగొస్తుందేమో, కనీసం అన్ని యాప్స్ తొలగించినా టిక్ టాక్ ఒక్కటి తిరిగి ప్రారంభించమని కోరేవారు ఉన్నారు. కానీ టిక్ టాక్ యాప్ తొలగించడంతో చైనా కూడా కాస్త ఇండియాపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తుంది.

చైనా యాప్ లను నిషేధించడంపై కేంద్ర ఐటీ సఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాత్రం డిజిటల్ స్ట్రైక్ గా అభివర్ణించారు. దేశ ప్రజల డేటాను సురక్షితంగా ఉంచేందుకు చైనా యాప్ లను బహిష్కరించామని, భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, కానీ ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే తగిన బదులిస్తామని తెలియచేసారు.. చైనా ఘటనపై మన దేశంలో కమ్యూనిస్టులు స్పందించకపోవడంపై కూడా రవిశంక ప్రసాద్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మన దేశంలో ఎలాగైతే చైనా యాప్స్ ను తొలగించి చైనాకు బుద్ధి చెప్పారో, అమెరికన్లు కూడా చైనా యాప్స్ అమెరికాలో కూడా తొలగించాలని, చైనా యాప్ ల వలన తమ వ్యక్తిగత డేటా భద్రతపై అనేక అనుమానాలున్నాయని చెబుతున్నారు. దీనితో అమెరికాతో పాటు పలు దేశాలు చైనా యాప్స్ తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే కనుక జరిగితే డిజిటల్ పరంగా చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు.