భారత్ హెడ్ కోచ్ గా మరోసారి ఎంపికైన రవిశాస్త్రి జీతం దాదాపుగా 20 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. గతేడాది రవిశాస్త్రి ఏడాదికి 8 కోట్ల రూపాయలు అందుకోగా, ప్రస్తుతం 9.5 నుంచి 10 కోట్లు అందుకోనున్నాడు. ఇక ఫీల్డింగ్ కోచ్ గా ఎంపికైన భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ కూడా 3.5 కోట్లు అందుకోనున్నారు. బ్యాటింగ్ కోచ్ బంగారు స్థానంలో కొత్తగా ఎంపికైన విక్రమ్ రాథోడ్ కు 2.5 నుంచి 3 కోట్లు రూపాయలు అందనున్నాయి.

బీసీసీఐ దాదాపుగా అందరకి 20 శాతం వరకు జీతాలు పెంచినట్లు తెలుస్తుంది. రవిశాస్త్రి టీమిండియాకు హెడ్ కోచ్ గా మరొక రెండేళ్లు సేవలందించనున్నాడు. ఇక ఈ జీతాలు కాకుండా మిగతా అలెవెన్సులు, గాత్ర ఉండనే ఉంటాయి. మొత్తానికి టీమిండియా జట్టుకు ఎంపికై గట్టిగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •