శివరాత్రి ముగిసిందంటే ఇక వేసవి తాపం మొదలైనట్లే. వేసవి కాలంలో కరెంటు కష్టాలు మన దేశంలో అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో వచ్చి పోయే కరెంటుతో ట్రాన్స్ ఫార్మర్లు మాడిపోతుంటాయి. ఇక వేసవి కాలానికి తగట్లు మన దగ్గర ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో లేవు. వాటిని మనం చైనా నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

కానీ కరోనా వైరస్ విజృంభణతో అక్కడ నుంచి ట్రాన్స్ ఫార్మర్లను తెప్పించుకోవాలంటే ప్రభుత్వం కాస్త సందిగ్ధంలో పడింది. కరోనా వైరస్ సోకినా దగ్గర నుంచి చైనా నుంచి ఎలాంటి ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం లేదు. కానీ ఈ వేసవిలో ట్రాన్స్ ఫార్మర్లతో సహా, పలు విద్యుత్ పరికరాలకు భారీగా కొరత ఉంది. దీనితో ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ వేసవిలో మరింత కరెంటు కష్టాలు తప్పేలా కనిపించటం లేదు. కరోనా వైరస్ మాత్రం రోజు రోజుకి విజ్రంభించడమే గాని తగ్గడం అనేది ఎక్కడ కంపడటం లేదు. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అన్ని దేశాలు చైనా సరిహద్దుని మూసి వేసి, చైనా నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై గట్టి నిఘా పెట్టింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •