యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘బీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చేశారు. ‘నీ నవ్వేమో సూపర్ క్యూటే.. ని వైట్ చున్నీ సూపర్ క్యూటే’ అంటూ సాగే పాటను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా స్టోరీ మొత్తం సేంద్రియ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •