యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘బీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పాటలకు, టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దుర్యోధన్, దుశ్శాసన, ధర్మరాజ్, యమ ధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి బీష్మ పేరు పెట్టారు నాకు. దాని వల్లనేమో నాకు ఒక్కరు పడట్లేదు అని నితిన్ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా స్టోరీ మొత్తం సేంద్రియ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •