టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భార్గవ్ రామ్ తనని కారుతో గుద్దాలని చూశాడని ఆళ్లగడ్డ ఎస్సై కేసు పెట్టాడు. ఆళ్లగడ్డలో భార్గవ్ రామ్ మీద రెండు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే భార్గవ్ రామ్ కారును వెంబడించిన పోలీసులు కారు ఆపకుండా వెళ్లిపోయాడని గచ్చిబౌలి పోలీసులకు ఆళ్లగడ్డ ఎస్సై పిర్యాదు చేసాడు. దీనితో పోలీసులు భార్గవ్ రామ్ మీద కేసు నమోదు చేశారు.