భూమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత అఖిలప్రియను ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాబినెట్ లో మంతిర్ పదవి ఇచ్చి గౌరవించాడు. ఆ తరువాత భూమా అఖిల ప్రియ నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతంలో దూకుడుగా ఉంటూ, తనకు శత్రువుగా మారిన ఏవి సుబ్బారెడ్డితో రోజు రోజుకి వైరం పెంచుకుంటూ ముందుకు వెళ్ళేది. చంద్రబాబు నాయుడు… భూమా అఖిల ప్రియను పిలిచి వైరాలకు వెళ్ల వద్దని చివాట్లు పెట్టి, వచ్చే ఎన్నికలలో మీ కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే ఇస్తామని చెప్పడంతో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో అఖిలప్రియ వ్యవహారం తేడా కొట్టినట్లు చెబుతున్నారు.

గత వారం తనకు సెక్యూరిటీ వద్దంటూ వెనక్కి పంపి అఖిలప్రియ సెక్యూరిటీ లేకుండానే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తుంది. రెండు రోజుల క్రితం కర్నూల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తే కూడా భూమా అఖిల ప్రియా దూరంగా ఉండి తన అసమ్మతిని వెళ్లగక్కింది. కానీ ఇప్పుడు భూమా అఖిల ప్రియా తనపైన వ్యతిరేక చానెల్స్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, తాను ఎప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉంటానని, భూమా నాగిరెడ్డి చూపించిన బాటలో ముందుకు వెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సెలవిచ్చింది.

ఒకవైపున అఖిల ప్రియా తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెబుతుండగానే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్లెక్సీలను తీసివేసి, మంత్రి అఖిల ప్రియ ఫోటోలు ఉన్న ఫ్లెక్సులు మాత్రమే ఉంచారు. ఒకవైపున తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెబుతూ మరొక వైపున చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తుంది. అఖిల ప్రియకు జనసేన నేత పవన్ కళ్యాణ్ తో చర్చలు ముగిశాయని వచ్చే ఎన్నికలలో నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాలు భూమా కుటుంబానికే ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయని, కానీ మంత్రి పదవి ఉండటంతో నేరుగా బయట పడకుండా ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అవమానపరిచేలా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.