తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సీరియస్ కు దూరమైన బుమ్రాకు మెరుగైన వైద్యం కోసం బ్రిటన్ తరలించనున్నట్లు తెలుస్తుంది. బుమ్రాకు మెరుగైన వైద్యం కోసం బీసీసీఐ బ్రిటన్ పంపిస్తుంది. అతడితో పాటు ఎన్.సీఏ ప్రధాన ఫీజియోథెరపిస్ట్ ఆశిష్ కౌశిక్ అతడితో పాటు బ్రిటన్ వెళ్లనున్నాడు.

బుమ్రా వెన్ను నొప్పికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు స్పెషలిస్ట్ ల అప్పాయింట్మెంట్ తీసుకున్నామని, ఎక్కువ మంది వైద్యుల అభిప్రాయం తీసుకోవాలని తమ ఉద్దేశమని బీసీసీఐకు చెందిన ఒక అధికారి తెలియచేసాడు. గత విండీస్ టూర్ లో నిప్పులు చెరిగే బౌలింగ్ తో బుమ్రా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హ్యాట్రిక్ వికెట్లు కూడా తీసుకొని ఔరా అనిపించాడు. ఇక ఆ సిరీస్ ముగింపు దశలోనే వెన్ను నొప్పి రావడంతో సిరీస్ తరువాత పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. గతంలో కూడా బుమ్రా వెన్ను నొప్పితో బాధపడిన సందర్భాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •