తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ జోరు కొనసాగుతుంది. మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్.. ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది. ఇక బిగ్ బాస్ చూస్తుండగానే మొదటివారం ఎలిమినేషన్ టైం వచ్చింది. బిగ్ బాస్-4 నుండి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ దర్శకుడు సూర్యకిరణ్. హోస్ట్ నాగార్జున.. సూర్యకిరణ్ ఎలిమినేట్ ను ప్రకటించగా మిగతా హౌస్ సభ్యులంతా నిరాశకు గురయ్యారు.

ఇక ఇంటి సభ్యులకు టాటా చెప్పిన సూర్యకిరణ్.. బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఎలిమినేటై వెళ్ళిపోతున్న సూర్యకిరణ్ చేత నాగార్జున స్వభావాన్ని బట్టి ఒక్కొక జంతువు దగ్గర ఒక్కొక్కరి పేరు పెట్టాలని సూచించారు. ఇక సూర్యకిరణ్ చాలా తెలివిగా ఎవరు బాధపడకుండా ఈ టాస్కు పూర్తి చేసి దేవికి బిగ్ బాంబు ఫేవర్ చేసి వెళ్లిపోయారు.

ఇక ఇంటి నుండి ఒక కంటెస్టెంట్ వెళ్లిపోగా, మరో కంటెస్టెంట్ ఎంటర్ అయ్యాడు. కమెడియన్ కుమార్ సాయి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. షోలోకి రావడం వెనక తన లక్ష్యాలను చెప్పిన సాయి.. కాన్ఫిడెంట్ గా షోలోకి ఎంటర్ అయ్యాడు. ఇక బుల్లితెర ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్న బిగ్ బాస్ షో రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది.

గాల్వాన్ లోయలో 60 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికా పత్రిక వెల్లడి

అంతర్జాతీయ ఆటగాడిపై ఎలాంటి దయ చూపించకుండా ఉరిశిక్ష వేసిన ఆ దేశ ప్రభుత్వం

త్వరలో డ్రగ్స్ వ్యవహారంలో ఒకొక్కరి రంకు బయటపడుతుందంటున్న నటి