బిగ్ బాస్… బిగ్ బాస్… బిగ్ బాస్ ఎక్కడ చూసిన ఇదే రచ్చ, నిన్న బిగ్ బాస్ రేటింగ్స్ కూడా అదిరిపోయేలా రావడంతో బిగ్ బాస్ తన పైత్యాన్ని రోజు రోజుకి పెంచుతూ ఇంట్లో గొడవలకు కారణమవుతూ ఇంట్లో అందరిని నిద్ర పోనివ్వకుండా రేపు ఏమి జరుగుతుందా అన్నట్లు బిగ్ బాస్ రోజుకొక సినిమా చూపిస్తున్నాడు.

ఇక బిగ్ బాస్ చూపించే సినిమాలలో తమన్నా సింహాద్రి తురుపు ముక్క అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే హౌస్ లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి మరికొంత ఆజ్యం పోసేలా గ్రూప్స్ కట్టడం దగ్గర నుంచి ఇక దొరికిన వారిని దొరికినట్లు చెడామడా తిట్టడంతో ప్రేక్షకులు ఔరా అంటున్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆధ్యంతం ఆకట్టుకోవడంతో తమన్నా నోటికి పని చెప్పింది.

బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా బజార్ నొక్కినప్పుడు ఎవరైతే ముందు వెళ్లి అక్కడ పెట్టిన డైమండ్ తీసుకుంటారో వారు చెప్పినట్లు హౌస్ మేట్స్ అంతా బిగ్ బాస్ ఆదేశాలు ఇచ్చేవరకు పాటించాలని చెబుతాడు. మొదటి బజర్ కొట్టగానే వరుణ్ సందేశ్ డైమండ్ ను చేజిక్కించుకోవడంతో, తన మంత్రిగా బాబా భాస్కర్ ను నియమించుకొని తన బట్టలు ఉతకమని హిమజను, తన బెడ్ రూమ్ సర్ధమని శ్రీముఖి, మహేష్ లకు ఆదేశాలిస్తాడు. నాగిని డాన్స్ వేయవలసిందిగా తమన్నాను… ఆమెకు సహాయం చేయవలసిందిగా బాబా భాస్కర్ ను ఆదేశిస్తాడు.

ఇక రెండవ బజర్ మోగగానే అలీ రెజా… శివ జ్యోతిని పక్కకు నెట్టి డైమండ్ కైవసం చేసుకుంటాడు. ఇక ఆలీ రెజా ఇంటి సభ్యులకు ఆడవారు మగవారిగా… మగవారు ఆడ వారీగా మారాలని ఆదేశిస్తాడు. కానీ ఈ టాస్క్ తాము ఆడలేమని మహేష్, తమన్నా, జాఫర్, వితిక షేరు పేర్కొని పక్కన కూర్చుంటారు. మిగతా వారంతా సరదాగా ఆడి పాడి టాస్క్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు ఇలాంటి టాస్క్ ఇచ్చిన ఆలీ రేజాను ఉద్దేశించి తమన్నా ఫైర్ అయింది… మాట మాట పెరగడంతో తానేమి మెగాస్టార్, సూపర్ స్టార్ కాదని, బాడీ ఉన్నంత మాత్రం సూపర్ స్టార్ కాలేరని… నువ్వు సూపర్ స్టార్ కాకుండా అడ్డుకుంటానని తమన్నా ఫైర్ అవ్వడంతో ఆలీ రెజా కంగుతిన్నాడు.

ఇక ఆలీ రెజా పక్కన కూర్చుకున్న అషురెడ్డిని పట్టుకొని ఆలీ రెజా మీద ఉన్న కోపంతో అషురెడ్డిని కూడా వాయించింది. అందంగా ఉన్నావు… సిగ్గు శరం లేకుండా అక్కడ ఎలా కూర్చుంటావంటూ ఫైర్ అయింది. అషురెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఇంటి సభ్యులంతా తమన్నా తీరును తప్పుపట్టారు. ఇక జాఫర్ తో చెబుతూ తాను హీరోయిన్ అని ఆలీ విలన్ అంటూ తన మీద కోపం వెళ్లగక్కింది. ఇక మూడో బజర్ మోగాక హిమజ డైమండ్ అందుకోవడంతో ఇంటి సభ్యులందరు తమ గురించి పరిచయం చేసుకోవాలని చెప్పడంతో తమన్నా, బాబా భస్కర్ కొంత ఉద్వేగంగా తాము పడ్డ కష్టాలు చెప్పడంతో పాటు బాబా భాస్కర్ తనకు ఉన్న కోపంతో ఎన్నో ఆఫర్స్ వదులుకున్నానని చెప్పుకొచ్చాడు. 

ఇక డైమండ్ అందుకున్న వరుణ్ సందేశ్, ఆలీ రెజా, హిమజాలలో ఒకరిని బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా నామినేట్ చేయాలనీ చెప్పడంతో ఇంటి సభ్యులు ఎక్కువ మంది వరుణ్ సందేశ్ పేరు చెప్పడంతో వరుణ్ ఈ వారం కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 

 
  •  
  •  
  •  
  •  
  •  
  •