బిగ్ బాస్ తెలుగు 3 ఈ వారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నా చివరకు రోహిణి ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా రోహిణి ఎలిమినేట్ అయితే తనకు తాను తప్పు చేసి బయటకు వచ్చేస్తున్నట్లు అనుకోవచ్చు. అసలు ఈ వారం మొదటగా నామినేషన్ లో రోహిణి లేదు. కాని బిగ్ బాస్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్స్ గురించి చర్చించడంతో బిగ్ బాస్ రోహిణిని రెండు వారాల పాటు వరుసగా నామినేట్ చేసాడు.

ఇక రోహిణి నామినేట్ అయిన రోజే ఈ రెండు వారాలలో ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ అనుకుంటుంటే ఈ వారమే రోహిణిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నవారిలో రోహిణి కాస్త పూర్ కంటెస్టెంట్… నామినేషన్ మొదలైన మొదటి రెండు రోజులలోనే రోహిణికి ప్రేక్షకుల నుంచి ఓట్ల పరంగా అంత మద్దతు లభించలేదు.

ఒకవేళ మనకు తెలిసినట్లు రోహిణి కనుక ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ పెద్ద బిగ్గర్ గేమ్ ఆడాడని అనుకోవచ్చు. రోహిణితో పాటు వితిక కూడా నామినేషన్ గురించి చర్చించినా వితికకు కనీసం వార్నింగ్ కూడా ఇవ్వకుండా రోహిణికి ఒక రూల్… వితికకు ఒక రూల్ లా బిగ్ బాస్ వ్యవహరించాడు. వితిక నామినేషన్ అయితే… ఈవారం పక్కా వితిక బయటకు వచ్చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం, లేదు. వితిక ప్రవర్తన పట్ల బయట ప్రేక్షకులలో బాగా వ్యతిరేకత ఉంది.

బిగ్ బాస్ దీనిని గమనించే వితిక నామినేషన్ లో లేకుండా చేశాడా అనిపిస్తుంది. వితిక హౌస్ నుంచి బయటకు వెళితే హౌస్ లో వరుణ్ సందేశ్ – వితికల మధ్య జరిగే రొమాన్స్ చూడటానికి ఉండదు. ప్రస్తుతానికి వారిద్దరి రొమాన్స్ తో బిగ్ బాస్ హౌస్ కాస్త హాట్ హాట్ గా మారింది. అందుకే ఇంకొన్ని వారాలు వితికను ఉంచి వరుణ్ సందేశ్ తో మరింత మసాలా యాడ్ చేసినా చేస్తాడు బిగ్ బాస్. ఈ వారం నిజంగా రోహిణి ఎలిమినేట్ అయ్యిందా లేదా అన్నది రేపు సాయంత్రం క్లారిటీ రానుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •