బిగ్ బాస్ సీజన్-4 మూడవవారం పూర్తి చేసుకుంది. మొదటిగా శనివారం ఎపిసోడ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కి నివాళులు అర్పిస్తూ షో ప్రారంభమైంది. ఇక ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక అనంతరం నాగార్జున ఇంటిసభ్యులు అందరిని పలకరించారు. వారితో కొన్ని గేమ్స్ ఆడించారు. చక్కగా పేర్చిన బ్రిక్స్ నుండి ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులు మిగతా బ్రిక్స్ పడకుండా ఒకటి తీయాలి. అలాగే నాగార్జున చెప్పే క్యాలిటీ ఇంటిసభ్యులలో ఎవరికి ఉందొ చెప్పాలి.

ఇక ఈ వారానికి మెహబూబ్‌, మోనాల్‌, కుమార్ సాయి, లాస్య, దేవి, అరియానా, హారికలు ఎలిమినేషన్‌కి ఎన్నికయ్యారు. వీరిలో లాస్య, మోనాల్ ను సేవ్ చేసారు నాగార్జున. మిగిలిన వారిలో సేవ్ అయిన నలుగురిని ఆదివారం ప్రకటిస్తారు. కాగా ఈ వారం మెహబూబ్‌ హౌజ్ నుంచి బయటకు రాబోతున్నట్లు సమాచారంగా ఉంది. ఉక్కు హృదయం టాస్క్ ఎఫెక్ట్‌ మెహబూబ్‌పై బాగా పడింది. ఆ టాస్క్‌లో చేస్తున్నప్పుడు మెహబూబ్ రెచ్చిపోయారు. దాంతో ప్రేక్షకుల్లో మెహబూబ్‌పై సమీకరణాలు మారిపోయాయి. దీంతో అతడు బయటకి వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్ ఓటమి.. బోణీ కొట్టిన నైట్‌రైడర్స్..!

దీపికా పదుకునేను ప్రశ్నించిన ఎన్‌సీబీ.. షాకింగ్ నిజాలు తెలిపిన దీపికా..!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి బడా నిర్మాత పేరు..!