తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ జోరు కొనసాగుతుంది. మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్.. ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుండి మొదటివారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కుమార్ సాయి.. ఇప్పుడు ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముక్కు అవినాష్ ను హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం అతడికి భారీగా ముట్టజెప్పినట్లు తెలుస్తుంది.

ఇక మరోవైపు అవినాష్ కూడా ఈ షో కోసం తనకు లైఫ్ ఇచ్చిన ‘జబర్దస్త్’ అగ్రిమెంట్ ను పక్కన పెట్టి మరి హౌస్ లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ‘జబర్దస్త్’ షో నిర్వాహకులు అతడికి 10 లక్షల రూపాయల ఫైన్ విధించారట. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ టీం.. హౌస్ లో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న లాస్య కన్నా అవినాష్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని తెలుస్తుంది. ఇక లాస్యకు రోజుకి లక్ష రూపాయల పారితోషికంగా ఇస్తున్నారు. ఇక ‘జబర్దస్త్’ వేసిన ఫైన్ ను బిగ్ బాస్ ద్వారా ముక్కు అవినాష్ వారం రోజుల్లో సంపాదించనున్నాడు. ఇక అవినాష్ దాదాపు 10 వారాల పాటు హౌస్ లో కొనసాగే అవకాశం ఉందంటున్నారు.

జగన్ కి జై కొట్టిన మరో టీడీపీ ఎమ్మెల్యే..!

‘మహాసముద్రం’ అఫీసియల్ ప్రకటన..!

కేంద్రం నెత్తిన వంద లక్షల కోట్ల అప్పు, మన దేశంలో అవినీతిపరుల దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసా?