బిగ్ బాస్ సీజన్-4 మూడవవారం పూర్తి చేసుకుని నాల్గవ వారానికి ఎంటరైంది. మూడవవారంలో బిగ్ బాస్ లో ఊహించని షాక్ తగిలింది. ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ గెలవాలన్న ద్వేయంతో హౌస్ లోకి అడుగుపెట్టిన దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌస్ లోని కంటెస్టెంట్లతో పాటు వీక్షకులు షాక్ అయ్యారు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లలో దేవి కూడా ఒకరు. ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉండడం.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆమె నైజం. ఆ ముక్కుసూటి తనమే హౌస్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఎక్కువ మందికి నచ్చింది. ఐతే అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అవడం ఇంటా బయటా చర్చగా మారింది.

ఇక ఈ సోమవారం బిగ్ బాస్ లో గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. ఎంతో కూల్ గా ఉండే నోయెల్, లాస్య గొడవ పడ్డారు. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో వీరు గొడవ పడినట్లుగా ఉంది. ఏదో విషయంలో వీరిద్దరూ మధ్య గొడవ జరిగినట్లుగా ఉంది. ఒకరిపై మరొకరు అరుపులు కేకలతో ఊగిపోయారు. ఎందుకు అరుస్తున్నవ్.. నాకు అరవడం రాదనుకున్నావా..’ అంటూ లాస్యపై రెచ్చిపోయాడు నోయెల్. నాకూ అరవడం వచ్చు.. వెనకాల మాట్లాడే అలవాటు నాకు లేదు. అంటూ లాస్య సమాధానం ఇచ్చింది.

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వండి.. మోదీకి సీఎం జగన్ లేఖ..!

అఫీషియల్.. విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ..!