ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్. గత ఏడాది తెలుగు బిగ్ బాస్-3 కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్ లో బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభం కావలసి ఉంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ షో ఎప్పుడు మొదలవుతుందో నిర్వాహుకులే చెప్పలేకపోతున్నారు. కాగా బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీరో తరుణ్, జాహ్నవి, మంగ్లీ, వ‌ర్షిణి, అఖిల్ శ్ర‌త‌క్‌, యాంక‌ర్ శివ బిగ్ బాస్ 4 షోలో పాల్గొనే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సీజన్ కు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడంటున్నారు. కరోనా ప్రభావంతో ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు.

ఏపీలో 2500 దాటిన పాజిటివ్ కేసులు.. 55 మరణాలు..!

స్వయానా టీడీపీ నేతే దొంగదీక్షలని ఒప్పుకున్నాడు..!