ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’. గత ఏడాది తెలుగు బిగ్ బాస్-3 కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్ లో బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభం కావలసి ఉంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ షో లేట్ అయ్యింది. ఇక ఈ షో మొదలు పెట్టడానికి నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు.

ఇక ఈ షోకి వస్తున్న ఆదరణ రీత్యా…బాగా తెలిసిన పాపులర్ ఫేసెస్ ని బిగ్ బాస్ ఇంటిలోకి పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ వీరేనంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ సునీత, యాంకర్ జాన్సీ, తాగుబోతు రమేష్, నందు, బిత్తరి సత్తి పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇక బిగ్ బాస్-3 కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 4వ సీజన్ కు కూడా ఆయన మళ్ళీ ఆయనే వ్యాఖ్యాతగా ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ కరోనా తాజా బులెటిన్.. జిహెచ్ఏంసి పరిధిలోనే 12682 పాజిటివ్ కేసులు..!

కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని మోదీ కీలక సూచనలు.. ముందు వారికే..!