కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సెలెబ్రెటీలందరు ప్రజలలో కరోనా పై అవగాహన కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న వారంతా కరోనాపై పాటతో ముందుకు వచ్చారు. ‘బోర్ కొడుతుంది అంటూ’ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.