ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది… ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో రాహుల్, వరుణ్, పునర్నవి, మహేష్ విట్టా ఉన్నారు. వీరి నలుగురిలో ఎవరికీ తక్కువ ఓటు పడ్డాయని గమనిస్తే చివరి రెండు స్థానాలలో మహేష్ విట్టా, పునర్నవి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరొక న్యూస్ ఏమిటంటే పునర్నవినే ఈ వారం ఎలిమినేటి అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

పునర్నవి బిగ్ బాస్ హౌస్ లో తన యాటిట్యూడ్ తో బిగ్ బాస్ హౌస్ లోనే కాకుండా బయట ఉన్న ప్రేక్షకుల మద్దతు కూడా రోజు రోజుకి కోల్పోవడంతోనే ఆమె పట్ల బయట ఉన్న ప్రేక్షకులు ఆమెను ఇక బయటకు తీసుకొని వచ్చేయాలని ఫిక్స్ అయిపోయారట. పునర్నవి నేరుగా ఒకటి, రెండు సార్లు బిగ్ బాస్ తోనే యుద్ధానికి దిగడంతో ఇందుకు కారణం అని చెప్పవచ్చు.

అందరూ ఒకటి చేయడానికి ప్రయత్నిస్తే, పునర్నవి మాత్రం వ్యతిరేకంగా తాను ఆలా ఏందుకు చేయాలని, నేను చేయనని అవసరమైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించి వేయండి అన్న రీతిలో మాట్లాడటంతో ఇప్పుడు ఆమె కోరుకున్నట్లు నిజంగానే బయటకు పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మహేష్ విట్టా పేరు కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నా కత్తి మహేష్ లాంటి వారు మాత్రం పునర్నవి అవుట్ అని పోస్టులు పెట్టడంతో ఈ వారం పునర్నవి ఎలిమినేట్ అయినట్లు అనుకోవాల్సిందే. రేపు సాయంత్రం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది పూర్తి క్లారిటీ రానుంది.