బిగ్ బాస్ తెలుగు సీజన్ పై సెలెబ్రెటీలు అంత ఆసక్తి చూపించకపోతున్నా చిన్న చితక నటులు మాత్రం అందులో కంటెస్ట్ట్ చేయాలని ఉబలాటపడుతుంటారు. అందులో భాగంగా జబర్దస్త్ ప్రోగ్రాంలో ఫేమస్ అయిన ముక్కు అవినాష్ రెండు రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు ముందుగా 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ లో అతడు ఉండాల్సిందట. కానీ అతడి ఎంట్రీని జబర్దస్త్ టీమ్ అడ్డుకున్నట్లు అనేక వార్తలు బయట షికారు చేస్తున్నాయి.

జబర్దస్త్ వదిలి మరొక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. అగ్రిమెంట్ గట్రాతో ముప్పుతిప్పలు పెడతారు. ఇలా అగ్రిమెంట్స్ ఉండటంతోనే చాలా మంది జబర్దస్త్ వదిలి నాగబాబుతో పాటు బయటకు వెళ్లలేకపోయారు. ముక్కు అవినాష్ కు బిగ్ బాస్ అనే ఒక షోలో మంచి ఆఫర్ రావడంతో దానికి వెళ్లాలని చూస్తే జబర్దస్త్ యాజమాన్యం పది లక్షల రూపాయలు కట్టి బయటకు వెళ్ళమని చెప్పిందట. దీనితో అతడు లీగల్ గా ఫైట్ చేసే సమయం దొరకక కిందా మీద పడి పది లక్షల రూపాయలను కట్టి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ తీసుకున్నాడు.

బిగ్ బాస్ యాజమాన్యం కూడా జబర్దస్త్ అగ్రిమెంట్ క్యాన్సిల్ కాకుండా తాము షోలోకి తీసుకోలేమని, అలా తీసుకుంటూ తమకు రాబోయే రోజులలో లీగల్ కష్టాలు వస్తాయని చెప్పడంతో అవినాష్ పది లక్షల రూపాయలను సమర్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా అగ్రిమెంట్ ల పేరుతో ఏళ్ళ తరబడి తమ దగ్గరే పెట్టుకొని చాలా మందిని వేధించి వెంటాడుతున్నారని చాల మంది ఫేమ్ పొందిన ఆర్టిస్టులు బాధపడిపోతున్నారట.