బిగ్ బాస్ మొదలవ్వడంతో బయట ఆర్మీలు కూడా పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చాయి. ఈ ఆర్మీలలో మొదటి స్థానం గంగవ్వ ఉండటంతో పాటు ఆమె పట్ల నెటిజన్స్ చూపించే ప్రేమ చూస్తుంటే ఆమెను ఏకంగా ఫైనల్స్ కు పంపిస్తారా అన్న అనుమానం కలుగుతుంది. అంతలా నెటిజన్స్ అవ్వకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక తమకు నచ్చని వారి పట్ల కూడా నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా బిగ్ బాస్ షో ఒక్క రోజు క్రితం బిగిన్ అయినా అప్పుడే షో లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ నెటిజన్స్ మనస్సులో నెగెటివ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. వారిలో ఒకరు దర్శకుడు సూర్యకిరణ్ కాగా మరొకరు కరాటీ కళ్యాణి. సూర్యకిరణ్ నిన్న జరిగిన మొదటి రోజు ఎపిసోడ్ లో హడావిడి చేస్తూ మీరు ఇలా మాట్లాడాలి, అలా ఎందుకు మాట్లాడుతున్నారంటూ తాను చెప్పిందే మీరు చేయాలనే రీతిలో డామినేషన్ చేసేలా ప్రవర్తించడంతో అతడి ఓవర్ యాక్షన్ ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో పనిచేయదని అతడిని ఎలిమినేటి చేసేసి బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాలని నెటిజన్స్ కోరుతున్నారు.

ఇక కరాటీ కళ్యాణి విషయానికి వస్తే నిన్న తెలంగాణ యాంకర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సుజాత విషయంలో ఆమె చేసిన హడావిడి నోరేసుకొని అరవడం చూస్తుంటే ఇప్పుడు ఆమె పట్ల తెలంగాణ పోరగాళ్ళు అంతా గుస్సవుతున్నారు. చిన్న పిల్ల అని చూడకుండా కరాటీ కళ్యాణి చేసిన హడావిడి నచ్చలేదని, ఆమెను కూడా ఎలిమినేట్ చేసేయాలని బలంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారం సూర్యకిరణ్ ఎలిమినేషన్ రౌండ్ లో ఉండటంతో అతడిని ఎలిమినేట్ చేసేయాలని తెగ కామెంట్స్ చేస్తుండటం చూస్తుంటే అతడు ఎలిమినేట్ అయిపోతాడా అనిపిస్తుంది.

ఇక కరాటీ కళ్యాణి విషయానికి వస్తే ఈ వారం ఆమె ఎలిమినేషన్ రౌండ్ లో లేదు. వచ్చే వారం లేదా ఆ తరువాత వారం ఎప్పుడైతే ఆమె ఎలిమినేషన్ లోకి వచ్చేస్తుందో మొదటి ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని ఆమె షో లో ముందుకు వెళ్లడం అనేది కష్టమని తెలుస్తుంది. ఇక సూర్యకిరణ్ కనుక ఈ వారం ప్రేక్షకుల మనస్సు దోచుకొని షో లో ముందుకు కొనసాగాలంటే ఈరోజు నుంచి జరిగే షోలో అతడు అతి తగ్గించుకొని కాస్త బాధ్యతగా మెలిగితే నెటిజన్స్ కరుణించే అవకాశం ఉంది. లేకపోతే మొదటి ఎలిమినేషన్ సూర్యకిరణ్ తో మొదలవ్వుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు.

గంగవ్వకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికం..!