కరాటీ కళ్యాణి గురించి కొత్తగా ఎవరకి పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ రచ్చ రచ్చ చేసేస్తుంటుంది. అలాంటి కరాటీ కళ్యాణి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన మొదటి వారం ఎవరి మీద పడితే వారి మీద అరిచేయడంతో ఆమె మొదటి రోజు నుంచే బిగ్ బాస్ అభిమానుల మనస్సులో నెగెటివ్ గా పడిపోయింది. మొదటివారం సూర్యకిరణ్ ను పంపించి, రెండవ వారం కరాటీ కళ్యాణిని షో నుంచి బయటకు పంపించి వేయాలని నెటిజన్స్ ట్విట్టర్ లో తెగ ట్వీట్స్ పెట్టారు. కానీ మొదటివారంతం నాగార్జున వచ్చి కరాటీ కళ్యాణికి క్లాస్ తీసుకోవడంతో తనలో ఉన్న తప్పు తెలుసుకొని రెండవ వారం కరాటీ కళ్యాణి అందరిని ఆకట్టుకునేలా చాలా చక్కగా ఆడి పాడింది.

సరదాగా పాటలు పాడటంతో పాటు ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా తనను తాను మార్చేసుకొని కొత్త కరాటీ కళ్యాణిని రెండవ వారం చూపించింది. దీనితో ఆమెపై ఈ వారం కాస్త ట్రోలింగ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వారం కరాటీ కళ్యాణి నామినేషన్ లలో ఉండటంతో ఆమె నామినేషన్ నుంచి తప్పించుకొని ఇంట్లో కొనసాగుతుందా లేక ఎలిమినేట్ అయిపోతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ కరాటీ కళ్యాణి ఎంత బాగా పెర్ఫర్మ్ చేసినా మొదటి వారం ఆమె చేసిన తప్పులకు బిగ్ బాస్ అభిమానులు ఆమెకు ఓట్లు వేయడానికి అంత ఆసక్తి చూపించలేదట. కానీ కరాటీ కళ్యాణి మరికొన్ని వారలు షోలో ఉంటే సందడి షురూ అని చెప్పుకోవచ్చు. చూద్దాం బిగ్ బాస్ అభిమానులు కరాటీ కళ్యాణిని ఈ వారం సేవ్ చేస్తారా లేక బయటకు పంపించి వేస్తారో?

పార్లమెంట్‌లో నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన ఎంపీ..!

మందు బాబులు ఎవరి కర్మకు వారే బాధ్యులు